ఏటీసీల్లో శిక్షణతో ఉపాధి అవకాశాలు : కలెక్టర్ విజయేందిర బోయి

ఏటీసీల్లో శిక్షణతో ఉపాధి అవకాశాలు : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీని విద్యార్థులకు అందజేయాలని కలెక్టర్  విజయేందిర బోయి ఏటీసీ సెంటర్  నిర్వాహకులకు సూచించారు. నగరంలోని ఐటీఐలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్  ట్రైనింగ్  సెంటర్ ను బుధవారం కలెక్టర్  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ఏటీసీలో అందిస్తున్న కోర్సులు దేశంలోనే  కాకుండా విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. 

సెంటర్ లో ఏర్పాటు చేసిన అత్యాదునిక యంత్రాల సాయంతో విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్  క్లాసులు చెప్పాలని సూచించారు. అంతకుముందు బస్టాండ్  సమీపంలోని బాదం రామస్వామి, సరోజాదేవి మున్సిపాలిటీ గోల్డెన్  జూబ్లీ ఆడిటోరియంను పరిశీలించారు.  మున్సిపాలిటీలో నిర్మిస్తున్న కళాభారతి భవన నిర్మాణంపై కలెక్టర్  ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, ఐటీఐ ప్రిన్సిపాల్  బి. శాంతయ్య, బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్  ఎస్. గోపాల్ నాయక్  పాల్గొన్నారు. 

మాడల్​ బేసిక్​ స్కూల్  సందర్శన..

మహబూబ్ నగర్ టౌన్ : నగరంలోని మాడల్  బేసిక్  హైస్కూల్ ను కలెక్టర్ విజయేందిరబోయి, అడిషనల్  కలెక్టర్  శివేంద్రప్రతాప్  సందర్శించారు. ఆస్ట్రో ల్యాబ్  టెలిస్కోప్, 42 రకాల ప్రయోగాలు, నక్షత్రశాల, గ్రహాల గురించి, ల్యాబ్ ను ఎలా ఉపయోగించవచ్చనే విషయాల గురించి స్కూల్ కు ఢిల్లీ నుంచి వచ్చిన ఆస్ట్రో ఫిజిక్స్ టీచర్  మిశ్రాను అడిగి తెలుసుకున్నారు. డీఈవో ప్రవీణ్ కుమార్, ఏఎంవో దుంకుడు శ్రీనివాస్, సీఎంవో సుధాకర్ రెడ్డి, హెచ్ఎం బాసిత్  ఉన్నారు.