- ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశం నిషేధం
- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ ప్రతి అనుమానాన్ని హ్యాండ్బుక్ చదివి క్లారిఫై చేసుకోవాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. సొంత నిర్ణయాలు వివాదాలకు కారణమవుతాయన్నారు. శుక్రవారం థర్డ్ ఫేజ్ జీపీ ఎన్నికల పీవోలకు ముప్కాల్ మండలంలోని రైతు వేదికలో మాస్టర్ ట్రైనర్స్‌తో శిక్షణ ఇప్పించి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్‌పై అవగాహన ఉంటే ఎక్కడ ఇబ్బంది రాదన్నారు.
ఓటర్ స్లిప్ ఐడీ కార్డుకాదని ఎస్ఈసీ సూచించిన విధంగా 18 రకాల ఐడీ ప్రూఫ్ల్లో ఏది ఉన్నా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పీవోగాని ఏపీవోగానీ ఎట్టి పరిస్థితిలో ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఎంటర్ కావద్దని సూచించారు. ఓటర్ల వెంట సహాయకులుగా వచ్చే వారి కుడి చేతి మధ్య వేలికి సిరా చుక్క వేయాలన్నారు.
మక్కజొన్న పేమెంట్‌కు రూ.10 కోట్లు రిలీజ్
జిల్లాలో మక్కజొన్న అమ్మిన రైతులకు బిల్ చెల్లింపు కోసం రూ.10 కోట్లు రిలీజ్ అయ్యాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా 33 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 2,63,016 క్వింటాళ్లు కొనుగోలు చేశామని, క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున పేమెంట్ చేస్తామన్నారు.

