సర్పంచ్​ భర్తపై కలెక్టర్ ఆగ్రహం 

సర్పంచ్​ భర్తపై కలెక్టర్ ఆగ్రహం 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల సర్పంచ్​ భర్తపై కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నేలపట్ల జడ్పీ స్కూల్​లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. స్కూల్​ ఆవరణలోని క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడం చూసి సీరియస్​ అయ్యారు. సిబ్బంది లేకపోతే గడ్డి ఎలా తీస్తామని సర్పంచ్​ భర్త శ్రీను సమాధానమిచ్చారు.

అతను సర్పంచ్​ భర్త అని అధికారులు చెప్పడంతో..‘ యూజ్ లెస్​ ఫెలో నువ్వెందుకు వచ్చావ్​​’ అంటూ కోపగించుకున్నారు. అక్కడి గడ్డి, పిచ్చి మొక్కలను కలెక్టర్​తో పాటు అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్ ​తొలగించి చూపించారు. తర్వాత సర్పంచ్​ ధనమ్మ అక్కడికి రాగా ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సెక్రటరీని సస్పెండ్​ చేయాలని అధికారులను ఆదేశించారు.