హనుమకొండ జిల్లాలో ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

హనుమకొండ జిల్లాలో ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
  • అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 193 దరఖాస్తులు
  • కలెక్టరేటర్లలో అర్జీలు స్వీకరించిన ఆయా జిల్లాల కలెక్టర్లు

హనుమకొండ/ మహబూబాబాద్​/ జనగామ అర్బన్​/ ములుగు, వెలుగు: ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్​ ప్రోగ్రాంలో కలెక్టర్లు ఫిర్యాదులను స్వీకరించారు. హనుమకొండ కలెక్టర్​ప్రావీణ్య అడిషనల్​ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్​రెడ్డి, డీఆర్వో వైవీ గణేశ్​తో కలిసి 193 దరఖాస్తులను స్వీకరించారు.

మహబూబాబాద్​లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని అడిషనల్​ కలెక్టర్ డేవిడ్​తో కలిసి 173 దరఖాస్తులు స్వీకరించగా, జనగామలో కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ములుగు కలెక్టరేట్ లో  కలెక్టర్ దివాకర టీఎస్ అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, సీహెచ్.మహేందర్ జీ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డితో కలిసి 45  దరఖాస్తులు తీసుకున్నారు.  ఈ సందర్భంగా వారు ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.