
గద్వాల/నాగర్కర్నూల్/ నారాయణపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లకు సూచనలు చేశారు. గురువారం గద్వాల మండలం చనుగొనిపల్లి, గుంటుపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గద్వాల కలెక్టర్ సంతోష్ ,అడిషనల్ కలెక్టర్ నర్సింగరావుతో కలిసి పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియలో వేగంపెంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. రెవెన్యూ, సివిల్సప్లై, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, సింగిల్విండో, వ్యవసాయ శాఖల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
వర్షాకాలంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్ లో ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల ఆఫీసర్లు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.