ఫిర్యాదులను పెండింగ్​ పెట్టొద్దు

ఫిర్యాదులను పెండింగ్​ పెట్టొద్దు

ఫిర్యాదులను పెండింగ్​ పెట్టొద్దు
ప్రజావాణిలో కలెక్టర్లు సి. నారాయణరెడ్డి, జితేశ్​ వి పాటిల్

నిజామాబాద్​ రూరల్/ కామారెడ్డి, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్​ పెట్టకుండా ప్రాధాన్య క్రమంలో వెంటనే పరిష్కరించాలని  నిజామాబాద్​, కామారెడ్డి కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జితేశ్​వి పాటిల్​అధికారులను ఆదేశించారు. సోమవారం వారి వారి కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు  ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.  ఆయా విభాగాల సమస్యలకు సంబంధించి మొత్తం 79 ఫిర్యాదులు  అందాయని నిజామాబాద్​జిల్లా అధికారులు తెలిపారు.  కామారెడ్డిలో 45 ఫిర్యాదులు రాగా, ఇందులో 24 రెవెన్యూ సమస్యలపై వచ్చినట్లు అధికారులు చెప్పారు.  ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. నిజామాబాద్ లో డీఆర్డీవో చందర్,  జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ , కామారెడ్డిలో అడిషనల్ కలెక్టర్​ వెంకటేశ్​ దొత్రే  కలెక్టర్లతో  పాటు ఫిర్యాదులు స్వీకరించారు.

రిపబ్లిక్​డే వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ప్రజావాణి అనంతరం కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో పలు అంశాలపై రివ్యూ జరిపారు. రిపబ్లిక్​డే వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల ప్రగతిని వివరించేలా శకటాల ప్రదర్శనతో పాటు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.  కార్మిక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఈ - శ్రమ్’ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు ఆయా శాఖల అధికారులు చొరవ చూపాలని కలెక్టర్  ఆదేశించారు.  దీని వల్ల కార్మికులకు పీఎం సురక్షా బీమా యోజన కింద  ఫ్రీగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు.  అనంతరం సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు కోసం ‘స్త్రీ నిధి’ రుణాలు అందించే కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.  

టాస్క్​ఫోర్స్​ మీటింగ్​

ఆర్టీసీ ఆధ్వర్యంలో  కామారెడ్డి కలెక్టరేట్​లో టాస్క్​ఫోర్స్​ మీటింగ్ జరిగింది.  బస్టాండు దగ్గర  ప్రైవేట్ వెహికల్స్​​కట్టడి చేయడం,  ఇతర అంశాలపై చర్చించారు. కలెక్టర్ జితేశ్​వి పాటిల్, అడిషనల్​ఎస్పీ అన్యోన్య,  ఆర్ఎం ఉషా,  ఆర్టీవో వాణి పాల్గొన్నారు. 

‘కంటి వెలుగు’ ను ఎంప్లాయీస్​ ఉపయోగించుకోవాలి

కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ఎంప్లాయీస్​కూడా వినియోగించుకోవాలని సూచించారు.  కలెక్టరేట్​లో ఎంప్లాయీస్​కోసం  ‘కంటి వెలుగు’ క్యాంపు ను  కలెక్టర్​ ప్రారంభించారు. అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రేతో పాటు ఆఫీసర్లు, సిబ్బంది టెస్టులు చేయించుకున్నారు.  రిపబ్లిక్​ డే వేడుకల కోసం ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్​ ఆయా శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై ఆఫీసర్లతో సమీక్ష జరిపారు.  శాఖల వారీగా ఉత్తమ ఆఫీసర్లు , సిబ్బంది వివరాలు అందజేయాలన్నారు.