
‘కలర్‌ఫొటో’ చిత్రంతో హీరోగా గుర్తింపును అందుకున్న సుహాస్.. లీడ్ రోల్‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రం ఒకటి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
శనివారం సుహాస్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ప్రతాప్ భండారి, గోపరాజు రమణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నాడు.