
‘భీష్మ’ సినిమాతో ఈ యేడు ప్రారంభంలోనే మంచి విజయాన్ని అందుకున్న నితిన్.. ఆ వెంటనే ‘రంగ్ దే’తో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ అన్ని సినిమాల్లాగే కరోనా ఎఫెక్ట్ నితిన్ మూవీపై కూడా పడింది. కరోనా వల్ల దొరికిన ఖాళీ టైమ్ ని సద్వినియోగం చేసుకుని పెళ్ళితో ఓ ఇంటి వాడైన నితిన్, త్వరలో తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. ఈ నెలాఖరు నుండి ‘రంగ్ దే’ షూటింగ్ రీస్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దీనికి దర్శకుడు. కీర్తీ సురేష్ హీరోయిన్. ఇటీవలే తన మరో సినిమా ‘గుడ్ లక్ సఖి’ షూటింగ్ ని కంప్లీట్ చేసిన కీర్తి, నితిన్ మూవీలో నటించేందుకు రెడీగా ఉంది. నిజానికి యూరప్‌లో కొంత భాగం షూట్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి లొకేషన్ మారుస్తారా లేక అక్కడే తీస్తారా అనేది తెలియాలి. పైగా ఇప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు కనుక ఈ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. పాజిటివ్ బజ్ ఉండటం వల్ల ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అయితే సినిమాను కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తామని మొదటి నుండీ చెబుతున్నారు నిర్మాతలు. ఆ మధ్య నితిన్ మ్యారేజ్‌కి వచ్చిన టీజర్‌లోనూ సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని హింటిచ్చారు. మరి ఓటీటీ సంస్థల తాజా ఆఫర్స్ కి కన్విన్స్ అవుతారా లేక ముందు అనుకున్నదానికే కట్టుబడతారా అనేది తెలియడానికి కాస్త సమయం పడుతుంది.