ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్​

పర్వతగిరి, వెలుగు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్​ ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అన్నారు.  వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం మంక్త్యా తండా, బూర్గుమడ్ల, చింతనెక్కొండ, భట్టు తండాలలో రూ. 7కోటి 86లక్షలతో చేపట్టిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, హెల్త్​సెంటర్, లైబ్రరీ, ఆర్ అండ్ బీ రోడ్డు, మహిళా సంఘం కమ్యూనిటీ హల్,  సీసీ రోడ్లు.. తదితరాలను మంగళవారం  ప్రారంభించారు.కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, వైస్​ ఎంపీపీ రాజేశ్వర్​రావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్​ శ్రీనివాస్​, ఆయా గ్రామాల సర్పంచులు సుష్మ, ఇందిర, అమ్మి, ఈర్యానాయక్​ పాల్గొన్నారు.

గ్రామాల్లో  ఎల్ఈడీ లైట్లు బిగించాలి : కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య

జనగామ అర్బన్​,వెలుగు: గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​ సీహెచ్​శివలింగయ్య అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్​ మినీ కాన్ఫరెన్స్ హల్​లో అడిషనల్​ కలెక్టర్​ప్రపుల్​ దేశాయ్​తో కలిసి ఎల్ఈడీ బల్బుల పనులపై రివ్వూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ విద్యుత్​ పొదుపు చర్యలో భాగంగా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్స్​ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్పంచ్​లతో మాట్లాడి ఎల్ఈడీ బల్బులు బిగించడంలో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ వేణుమాధవ్​, డీపీవో వసంత, డీఎల్పీవో, రెడ్కో ప్రతినిధులు హరిగోపాల్, మహేందర్​రెడ్డి, అశోక్, ఎలక్ట్రిసిటీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

హాస్టల్ విద్యార్థులపై వేధింపులు మానుకోవాలి

హసన్‌‌పర్తి, వెలుగు: కేయూలోని పోతన హాస్టల్​లో ఉంటున్న విద్యార్థులపై అధికారుల వేధింపులు మానుకోవాలని రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి నరేశ్​ హెచ్చరించారు. మంగళవారం కేయూ జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హాస్టల్ ను పరిశీలించారు. ఆ టైంలో కేయూ అధికారులు హాస్టల్ కి రావడంతో అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించడానికి రాని అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించడానికి వచ్చారా అని ప్రశ్నించారు. దీంతో  విద్యార్థులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మన్ తిరుపతి యాదవ్ , కేయూ విద్యార్థి సంఘాల నేతలు ఎండీ పాషా, మంద నరేశ్, బొట్ల మనోహర్, ప్రశాంత్, రాజేశ్, రాంబాబు పాల్గొన్నారు. 

ఫిజికల్​ టెస్ట్​లకు అంతా రెడీ

హనుమకొండ, వెలుగు: పోలీస్​ ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు హనుమకొండలోని కేయూ గ్రౌండ్​ రెడీ చేశారు. మంగళవారం గ్రౌండ్​ ను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్​, ఇతర ఆఫీసర్లు పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీసి, పకడ్బందీగా ఈవెంట్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్​ ఆఫీసర్లకు సూచించారు. ఈ నెల 8 నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈవెంట్లు జరగనుండగా..  ఉమ్మడి జిల్లా నుంచి 24,612 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈవెంట్లు ప్రారంభం కానుండగా.. వేర్వేరు తేదీల్లో డైలీ దాదాపు 1,250 మంది  చొప్పున అభ్యర్థులకు టెస్టులు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం అభ్యర్థుల కోసం ప్రీ

ఈవెంట్స్​ టెస్ట్​ నిర్వహించారు.  సీపీ 

మాట్లాడుతూ అభ్యర్థులకు సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ అనంతరం  బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుందని, అభ్యర్థులు చేతులకు మెహందీ, పచ్చబొట్లు లేకుండా జాగ్రత్త పడాలన్నారు.  ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్​ వేస్తామని,  అభ్యర్థులు గ్రౌండ్​ నుంచి బయటకు వెళ్లే వరకు ఆ బ్యాండ్​ను చేతికే ఉంచుకోవాలన్నారు. టెస్ట్​ ముగిసిన తర్వాత ఆఫీసర్ల పర్యవేక్షణలోనే రిస్ట్​బ్యాండ్​  తొలగిస్తారని, ఒకవేళ ముందే తీసేయడం, డ్యామేజ్​ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే  అనర్హులుగా ప్రకటిస్తామన్నారు.  కార్యక్రమంలో అడిషనల్​ డీసీపీ  వైభవ్ గైక్వాడ్​,  ఏఆర్ అడిషనల్​  డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీ అనంతయ్య పాల్గొన్నారు.

అగ్రకులాల చేతుల్లో మోసపోవద్దు : డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ ​మహరాజ్​

ధర్మసాగర్​, వెలుగు: అగ్రకులాల చేతుల్లో అణగారిన వర్గాలు మోసపోవద్దని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్ మహరాజ్ అన్నారు. మంగళవారం 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ధర్మసాగర్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహరాజ్​మండలంలోని వివిధ గ్రామాల్లో డీఎస్పీ జెండాలు, శిలాఫలకాలను ఆవిష్కరించి మాట్లాడారు.  రెడ్డి, వెలమ దొరల రాజ్యాన్ని తెలంగాణలో కూల్చి అట్టడుగు కులాలను అధికారంలోకి తెచ్చేందుకు స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఓటు చైతన్యం, రాజకీయ విద్యపై బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి, రాజ్యం, సంపద రెండు కులాల చేతుల్లో ఉండడం అప్రజాస్వామికమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, జిల్లా అధ్యక్షుడు రాజేశ్, ధర్మసాగర్ మండలాధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.

కేజీబీవీలో పేరెంట్స్​ మీట్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లోని కేజీబీవీలో మంగళవారం పేరెంట్స్​ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా బాలికలు చేసిన కల్చరల్​ప్రోగ్రామ్స్​ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహాత్మా హెల్పింగ్​ వలంటరీ ఆర్గనైజేషన్ ​చైర్మన్​గంటా రవీందర్, ఎంపీటీసీ నర్సింహులు, పుల్లయ్య, కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్​ రేణుక పాల్గొన్నారు

గుర్తుతెలియని శవం కేఎంసీకి అప్పగింత 

వరంగల్​సిటీ, కాజీపేట, వెలుగు: గుర్తు తెలియని శవాన్ని  మంగళవారం కాజీపేట పోలీసులు కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు.  డిసెంబర్​1న గుర్తుతెలియని మగ వ్యక్తి (సుమారు 50–60 ఏండ్లు) బాపూజీ నగర్ లో ఇసుకలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గుర్తించిన పోలీసులు108 లో ఎంజీఎంకు తరలించారు.  చికిత్స పొందుతూ అదేరోజు చనిపోయాడు.  కాజీపేట వీఆర్ఏ నర్సయ్య  పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని శవం కావడంతో ఈనెల 5 వరకు ఎంజీఎం మార్చురీలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఎవరూ రానందున పంచనామా చేసి, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా శవాన్ని కేఎంసీకి అప్పగించారు. కమిషనరేట్​పరిధిలో గుర్తుతెలియని శవాన్ని కేఎంసీకి అప్పగించడం ఇదే తొలిసారి. 

హోంగార్డుల సేవలు ప్రత్యేకం: డీసీఆర్బీ డీఎస్పీ సుభాష్​బాబు

ములుగు, వెలుగు: లాఅండ్​ఆర్డర్​రక్షణలో హోంగార్డుల సేవలు ప్రత్యేకమని డీసీఆర్బీ డీఎస్పీ సుభాష్ బాబు కొనియాడారు. హోంగార్డ్స్​ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు పోలీస్​హెడ్​క్వార్టర్స్​లో పరేడ్​నిర్వహించారు.  ముందుగా డీఎస్పీ గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబైలో జరిగిన అల్లర్లు, మత విద్వేషాల నివారణలో హోంగార్డులు పోలీసు అధికారులకు ఎంతో సహకరించారన్నారు. అందుకే ఏటా డిసెంబర్​ 6న హోంగార్డ్స్​ రైజింగ్ డేను నిర్వహించుకుంటున్నామన్నారు. కంపెనీ కమాండర్​గా అజ్మీర వెంకట్రాం, ప్లాటూన్​ కమాండర్లుగా కోయిల జితేందర్, వేముల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎస్​బీ సీఐ సార్ల రాజు, ఆర్ఐ (అడ్మిన్​) ఆర్.స్వామి, ఆర్​ఐ (ఆపరేషన్స్) కిరణ్​, ఆర్ఎస్సై సంపత్​ రావు పాల్గొన్నారు.