‘‘మత్తు వదలరా1 అండ్ 2’’, ‘‘హ్యాపీ బర్త్‌డే’’వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ రితేష్ రానా. ఇప్పుడు ఆయన తన నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్ సత్య హీరోగా ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించి, గ్లింప్స్ సైతం రిలీజ్ చేశాడు. పూర్తి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
►ALSO READ | Kaantha Review: ‘కాంత’ ఫుల్ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ఎలా ఉందంటే?
రితేష్ రానా-సత్య కాంబోలో రానున్న మూవీ శుక్రవారం (నవంబర్ 14న) టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ మూవీకి ‘జెట్లీ’ (JETLEE)అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సత్యకి జోడిగా మిస్ యూనివర్స్ రియా సింఘా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#RR4 is #JETLEE ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2025
̶C̶o̶m̶e̶d̶i̶a̶n̶ ̶S̶a̶t̶y̶a̶ ̶ HERO #Satya in and not as #JETLEE ❤🔥
A @RiteshRana's turbulence 🛫
Entertainment takes off. Shoot begins 💥💥
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Music by @kaalabhairava7
Produced by @ClapEntrtmnt
Presented… pic.twitter.com/X99IRAAEVt
ఇది కూడా రితేష్ రాణా ప్రీవియస్ మూవీస్ స్టైల్ లోనే ఉండబోతుందని అర్ధమవుతోంది. సరికొత్త కామెడీ, క్రేజీ ట్విస్టులతో తెరకెక్కుతుందని, టైటిల్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో సత్య, రితేష్ రాణా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి.
