Comedian Seshu : ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Comedian Seshu : ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ప్రముఖ తమిళ కమెడియన్ శేషు(Seshu)..పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్ శేషు(60) అలియాస్ లొల్లు సభ శేషు కన్నుమూశారు. పది రోజుల క్రితం గుండెపోటుకు గురైన శేషు చెన్నైలోని ప్రైవేటు కావేరి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం (మార్చి 26న) తుదిశ్వాస విడిచారు.

హాస్య మేధావిని కోల్పోవడంతో సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆయన అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా రేపు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేషుకి ముగ్గురు కొడుకులు. శేషు స్మాల్ స్క్రీన్‌పై పాపులర్ కామెడీ షో లొల్లు సభతో ఎంతో గుర్తింపు పొందారు.

కమెడియన్ శేషు సినిమాల విషయానికి వస్తే..తమిళంలో ధనుష్ తుల్లువదో ఇలామై,వేలాయుధం, డిక్కిలోనా, A1, పారిస్ జయరాజ్,గుల్ గుల్, బిల్డప్ వంటి అనేక సినిమాల్లో నటించారు. శేషు సుమారు ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించి మెప్పించారు. అంతేకాదు ఆయనలో ఉన్న సామాజిక స్పృహతో కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసి ప్రశంసలు అందుకున్నారు. .