భారీగా పెరిగిన సిలిండర్ ధర.. ఒకేసారి రూ. 273 పెంపు

భారీగా పెరిగిన సిలిండర్ ధర.. ఒకేసారి రూ. 273 పెంపు

గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఈ రోజు గ్యాస్ ధరను పెంచాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్  ధరను భారీగా పెంచాయి. ఒకేసారి 273 రూపాయలు పెంచేశాయి. దీంతో హైదరాబాద్‎లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్  ధర 2, 460కి చేరింది. అయితే గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీని ధర 1002 దగ్గర నిలకడగా ఉంది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్  ధర 250 పెరిగి.. 2,253కు చేరింది.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి జీవనం తలకిందులైతోంది. ఆయిల్ కంపెనీల నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కూడా మిన్నంటుతున్నాయి. పాల ప్యాకెట్లు, కూరగాయలు, వంట నూనెలు.. ఇలా ఏది చూసినా పెరిగిన ధరలే కనిపిస్తున్నాయి. ధరల పెరుగుదలతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

For More News..

కాంట్రాక్ట్ కిల్లర్‌‌‌‌గా ప్రియమణి