
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైంది ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ దేశంలోని కొన్ని చోట్ల కరోనా మూడో దశకు చేరుకుందని, చాలా చోట్ల కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కూడా ఎక్కువైందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ అన్నా రు. మూడో దశ కేవలం కొన్ని ప్రాంతాల్లో నే ఉందని, ఆదిలోనే దాన్ని కట్టడి చేయగలిగితే డేంజర్ జోన్ నుంచి బయట పడట్లే అని ఆయన అభిప్రాయప డ్డారు. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని, ఈ నెల 10 తర్వాత పరిస్థితిని బట్టి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఢిల్లీలోని మర్కజ్‌లో మత ప్రార్ధనల కారణంగా దేశంలో కరోనా కేసులు ఎక్కు వయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు డాక్టర్లు, వైద్య సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.