భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలి

భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలి

జైపూర్, వెలుగు: జైపూర్​మండలంలోని నర్వ గ్రామ శివారు నుంచి గోపాల్ పూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని ఆ గ్రామాల రైతులు బుధవారం కలెక్టర్ బదావత్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. గ్రీన్​ఫీల్డ్ హైవేలో ఎకరాకు బహిరంగ మార్కెట్ లో రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉందన్నారు. 

కానీ ఆ భూములకు తక్కువ నష్టపరిహారం చెల్లిస్తామని సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చారని రైతులు వాపోయారు. వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న రైతులను ఆదుకొని నష్టపరిహరం పెంచాలని కలెక్టర్ ను కోరారు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుంటే తమ భూములను ఇవ్వబోమని వెల్లడించారు.