మార్కెట్ రేటు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి..కొడంగల్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు సమావేశం

మార్కెట్ రేటు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి..కొడంగల్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు సమావేశం

కొడంగల్, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి మార్కెట్​ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​ చేశారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులతో సోమవారం  అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్​అండ్​బీ డీఈఈ సురేందర్​ మాట్లాడుతూ.. రోడ్డుకు అడ్డంగా ఉన్న 107 నిర్మాణాలను తొలగించనున్నట్లు తెలిపారు. బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు కూల్చడం ఏంటని కొందరు అధికారులను నిలదీశారు. తమకు మార్కెట్​ రేటుకు తగ్గకుండ పరిహారం, ప్లాట్లు అందించాలని డిమాండ్​ చేశారు.