రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తా

రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తా

రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని, ప్రేమాభిమానులు తనపై ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని తనకు కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్స్ చేశారు. ఏపీ సీఎంగా సీఎం జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం’. అని సీఎం జగన్ తెలిపారు. 

 

మూడు సంవత్సరాల కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మ్రోగించింది. 175 సీట్లలో ఏకంగా 151 సీట్లలో విజయం సాధించి టీడీపీకి చుక్కలు చూపెట్టింది. 2019, మే 30వ తేదీన సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనం ఎగురవేసింది వైసీపీ పార్టీ. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సంబరాలు చేసుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తల కోసం : -

జగన్ తిన్నదంతా కక్కిస్తాం


శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం