ఖిల్లాగణపురం మండలలో కంప్యూటర్ దొంగల అరెస్టు  

ఖిల్లాగణపురం మండలలో కంప్యూటర్ దొంగల అరెస్టు  

ఖిల్లాగణపురం, వెలుగు :  మండలకేంద్రంలోని రైతు వేదికలో గత నెల 30న  కంప్యూటర్, వాటి పరికరాలను చోరీ చేసిన వారిని గురువారం అరెస్ట్​ చేసినట్లు ఎస్సై సురేష్​గౌడ్​ తెలిపారు. రైతు వేదిక క్లస్టర్ కంప్యూటర్ టెక్నీషియన్ సునీత ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.  గురువారం వెంకటాంపల్లి రూట్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం కలిగి ఆటో  చెక్ చేయగా.. కంప్యూటర్ పరికరాలు కనిపించాయి.

ఆటోలో ఉన్న  ఆగారం గ్రామానికి చెందిన చిట్యాల మాధవులు, బొక్కెన నాగార్జున, కోతి మన్నెమయ్యు  చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని, సొంత ఆటోలో కంప్యూటర్ పరికరాలు వేసుకొని అమ్మడానికి వెళుతుండగా పట్టుకుని, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది లింగం, బి రాజు, చైతన్యకుమార్, మునవర్ లను జిల్లా  ఎస్పీ గిరిధర్  అభినందించినట్లు ఎస్సైపేర్కొన్నారు