సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఆందోళన

సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఆందోళన

అన్నపురెడ్డిపల్లి, వెలుగు :  మండలంలోని ఎర్రగుంట గ్రామంలోని ముక్కెర బజారులో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గురువారం రజక సంఘం నాయకులు ఆందోళన చేశారు. అన్నపురెడ్డిపల్లి తహసీల్దారు ఆఫీసు ముందు నిరసన తెలిపారు. తహసీల్దారు ఆఫీసు ముందు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ రాంబాంబు  మాట్లాడుతూ  పనులు చేయకుండా కొంత మంది రాజకీయం చేస్తూ అడ్డుకుంటున్నారని తెలిపారు. 

మండల ఆఫీసర్ల దృష్టి కి సమస్య విన్నవించుకున్న పట్టించుకోలేదని  అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆఫీసర్ల తీరు మారకపోతే దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దారు జగదీశ్వర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ముసలయ్య, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.