సిద్దిపేట జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు

సిద్దిపేట జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : గడువు దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం  నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్​ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలకు మొత్తం  ఏడుగురు నామినేషన్లు వేశారు. మెదక్ నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున వనపర్తి రోహిత్​, ఇండిపెండెంట్లుగా అడ్ల కుమార్​, పట్లోళ్ల బాపురెడ్డి నామినేషన్​ వేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్​ తరపున ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్​ కుమార్​, బీఆర్​ఎస్​ తరపున వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ తరపున ఎర్రగొళ్ల మురళీ యాదవ్​ నామినేషన్​ దాఖలు చేశారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయి.  దుబ్బాక నుంచి ఇండిపెండెంట్లుగా జక్కుల నర్సింలు, దండ్ల నరేశ్, పెద్ద లింగన్నగారి ప్రసాద్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి వేముట వెంకట ప్రసన్న, రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అభ్యర్థిగా గౌటీ మల్లేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట నుంచి కొండ ప్రశాంత్  రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ, అఖిల్ భారతీయ హిందూ మహాసభ పార్టీ, బయ్యారం కమలాకర్ రెడ్డి  యుగ తులసి పార్టీ,  కర్రోల బాబు ధర్మ సమాజ్ పార్టీ, పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్లుగా బొమ్మల విజయ్ , గుమ్మడి శ్రీశైలం,  బర్రె మల్లయ్య,  గాధగొని చక్రధర్ గౌడ్ , కొలిమి మల్లేశం, చేన్నోజు రాజు  నామినేషన్లు  దాఖలు చేశారు.

హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితల సతీశ్ కుమార్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బీ.సదన్ మహారాజ్,  విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా కె.సందీప్ ఇండిపెండెంట్ గా  ఎ.రాజ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్​ నుంచి కాంగ్రెస్  అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ నుంచి డీ.బుగ్గరాజు, డెమోక్రటిక్ రిఫార్మ్ పార్టీ నుంచి జి. ప్రభాకర్ రెడ్డి, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ నుంచి భూంపల్లి కిషోర్ , విద్యావంతుల రాజకీయ పార్టీ నుంచి ఎన్.నాగరాజు, ఇండిపెండెంట్లుగా బి. మాధవరెడ్డి, వరుకోలు శ్రీనివాస్,ఆర్.లక్ష్మినారాయణ, పల్లె మాణిక్​ ప్రభు, కె.యాదయ్య

Also Read :- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు

ఫరూక్ అహ్మద్ హుస్సేన్,  వై.ముఖేష్ రెడ్డి,  ఎ.తిరుపతిరెడ్డి, బి.పాండు, ఎం. కృష్ణ, డి. భానుచందర్, ఎన్.ప్రసాద్,  వి.కరుణాకర్ , నిఖిల్ రెడ్డి, జె.ముత్యాలు, బి.శ్రీనివాస రెడ్డి,  సీ.రమేశ్ కుమార్,  బి.సతీశ్​కుమార్,  ఎం.నారాయణ రెడ్డి, ఎన్. లింభారెడ్డి నామినేషన్లు  దాఖలు చేశారు. ఇండిపెండెంట్లలో జగిత్యాల జిల్లా చెరుకు రైతులు, మల్లన్న సాగర్ నిర్వాసితులు ఉన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు మొత్తం  76  నామినేషన్లు దాఖలయ్యాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. నారాయణఖేడ్​ స్థానానికి బీఆర్​ఎస్​ తరపున రెండు సెట్లు, కాంగ్రెస్​ తరపున ఒకటి, బహుజన సమాజ్​ పార్టీ తరపున ఒకటి, ఇండిపెండెంట్​అభ్యర్థి ఒకరు నామినేషన్​ వేశారు. ఆందోల్​ అసెంబ్లీ స్థానంలో బీఆర్​ఎస్​ తరపున రెండు సెట్లు, బీఎస్పీ తరపున ఒకటి, ఇండియా ప్రజా బంధు పార్టీ తరపున ఒకటి, ఇండిపెండెంట్​గా ఒకరు నామినేషన్​ వేశారు.

జహీరాబాద్​ అసెంబ్లీ స్థానానికి బహుజన సమాజ్​ పార్టీ తరపున ఒకటి, ఇండిపెండెంట్లు ముగ్గురు నామినేషన్లు వేశారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​ తరపున ఒకటి, బీజేపీ తరపున ఒకటి, భారత చైతన్య యువజన పార్టీ తరపున ఒకటి, ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. పటాన్​చెరు అసెంబ్లీ స్థానంలో మార్కిస్ట్​ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా తరపున ఒకటి, ఇండిపెండెంట్​గా ఒకరు నామినేషన్​ దాఖలు చేశారు.