కాంగ్రెస్ తుఫాన్​లో బీఆర్ఎస్ కొట్టుకుపోతది : వీర్లపల్లి శంకర్

కాంగ్రెస్ తుఫాన్​లో బీఆర్ఎస్ కొట్టుకుపోతది : వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: కాంగ్రెస్ తుఫాన్​లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొందుర్గ్ మండలం ఉమ్మెంత్యాల, లాలాపేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో  ‘అభయ హస్తం’లో అన్ని వర్గాలకు సమాన న్యాయం దక్కిందన్నారు. 

కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో జనం ఉన్నారని ఆయన తెలిపారు. తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. షాద్ నగర్ పట్టణంలోని 24, 25 వార్డుల్లో వీర్లపల్లి శంకర్ సతీమణి అనూరాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.