బస్సుల్లో ఫ్రీ జర్నీ.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరతాం : రాహుల్ గాంధీ

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరతాం : రాహుల్ గాంధీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత వరంగల్ లో పర్యటించారు.  వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి సర్కిల్ వరకు పాదయాత్ర చేసిన అనంతరం రాహుల్ బహిరంగ సభలో ప్రసంగించారు.  తెలంగాణ ప్రజల  అభివృద్ది సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే... తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబానికి పరిమితమైందన్నారు.  ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ ...కాంగ్రెస్ ఏమి చేసిందన్న కేసీఆర్ ప్రశ్నకు సమాధానంగా.. మీరు చదువుకున్న పాఠశాల.. కాలేజీ,, యూనివర్శిటీ కాంగ్రెస్ పార్టీ నిర్మించినవేనన్నారు.

తాను  కాళేశ్వరం ప్రాజెక్టు చూశానన్న రాహుల్.. నిర్మించిన మూడేళ్లకే గోడలు పగిలి.. పిల్లర్లు కూలాయన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పరాకాష్ఠగా మారిందన్నారు.  దళిత బంధు స్కీంలో  ప్రతి ఎమ్మెల్యే రూ. 3 లక్షలు తీసుకుంటున్నారని.. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతం రావడం లేదన్నారు.   గత ఎన్నికల్లో రైతు రుణాలు మాఫీ చేస్తానన్న కేసీఆర్ ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఎరువులు ఇచ్చిందన్న రాహుల్.. ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డులను క్రమబద్దీకరిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం .. బీఆర్ఎస్ నేతలు రైతుల భూమిని లాక్కొన్నారన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలో .. మొదటి సంతకం ఆరు గ్యారంటీల అమలుపై చేస్తామన్నారు.  రూ. 500 లకే గ్యాస్ సిలెండర్, మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం... రైతులకు 24 గంటలు కరంట్ ఇస్తామన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.  అలాగే మహిళలకు నెలకు రూ. 2,500,వ్యవసాయ కార్మికులకు రూ. 1200, రైతు భరోసా కిందర రూ.15 వేలు ఇస్తామన్నారు.  స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనే వారి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ. 5 లక్షలు ఆర్థిక సాయం,, వృద్దులకు చేయాత పథకంలో రూ. 4 వేలు ఇస్తామన్నారు. 

బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అన్న రాహుల్ .. కేసీఆర్ తన కుటుంబసభ్యలకు అండగా ఉంటే.. మోదీ.. అదానీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కులగణన చేస్తామన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు నిర్మిస్తామన్నారు.  పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల వల్ల కొత్త నాయకత్వం వస్తుందన్నారు.  

గల్లీలో కేసీఆర్.. ఢిల్లీలో మోదీ జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న రాహుల్.. ఇది విద్వేషాలు పంచే దేశం కాదని.. ప్రేమను పంచే దేశమన్నారు.  విద్వేషపు బజారులో కాంగ్రెస్ ప్రేమ అనే విత్తనాన్ని నాటుతుందన్నారు,  బీజేపీ, బీఆర్ఎస్ ఒకే చెట్టు.. రెండు కొమ్మలన్నారు.   మోదీ వాహనానికి పంచరైతే కేసీఆర్ గాలికొడతారని సెటైర్లు వేశారు.  పార్లమెంట్ బీఆర్ఎస్ సభ్యలుకు .. బీజేపీ నేతలు సైగలు చేస్తారన్నారు.  చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీ ఎంఐఎంను వాడుకుంటుందన్న రాహుల్ కేసీర్ ను తెలంగాణ పొలిమెరలనుంచి వెళ్లగొట్టాలన్నారు.  2024లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు