కాంగ్రెస్ హయాంలోనే మహిళా సంక్షేమం : ఎంపీ మల్లు రవి 

కాంగ్రెస్ హయాంలోనే మహిళా సంక్షేమం : ఎంపీ మల్లు రవి 

కల్వకుర్తి, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు.  మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో పట్టణ మైనార్టీ మహిళలకు 150  కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మహిళా సంక్షేమం ఉంటుందని పేర్కొన్నారు.  

కల్వకుర్తి మండలానికి మరిన్ని కుట్టుమిషన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తక్కువ కాలంలోనే అన్ని వర్గాల వారు సంక్షేమ పథకాలు పొందారని తెలిపారు.  నిరుద్యోగులకు ఉద్యోగాల తో పాటు రాజీవ్ యువ వికాసం పేరిట రూ. 6 వేల కోట్లు కేటాయించిందని అన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ కుమార్, ఇజాస్, ఆర్డీవో శ్రీనివాస్ మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.