షిఫ్టింగ్  చార్జీలు చెల్లించాలని ధర్నా: రాజీవ్ రెడ్డి

షిఫ్టింగ్  చార్జీలు చెల్లించాలని ధర్నా: రాజీవ్ రెడ్డి

గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్  నిర్వాసితులకు 2017 చట్టం ప్రకారం గ్రామ షిఫ్టింగ్  చార్జీల కింద రూ. 7 లక్షలు చెల్లించాలని పీసీసీ సెక్రటరీ విజయ్ కుమార్, యువజన కాంగ్రెస్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి డిమాండ్  చేశారు. శుక్రవారం నిర్వాసితులను ఆదుకోవాలని రిజర్వాయర్  దగ్గర ధర్నా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు లిఫ్ట్​లో భాగంగా చిన్నంపల్లి రిజర్వాయర్  నిర్మాణాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ పనులను ఆలస్యం చేసి రైతులను మోసం చేశారన్నారు. ఆర్అండ్ఆర్  ద్వారా డబుల్  బెడ్రూమ్  ఇండ్లు కట్టించి, సౌలతులు కల్పించాలని డిమాండ్  చేశారు. గతంలో వన్ టైం సెటిల్మెంట్  అంటూ నిర్వాసితులను మోసం చేశారన్నారు. న్యాయం చేయాలని నిర్వాసితులు పోరాటం చేస్తే కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.

బేషరతుగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్  చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటామని హెచ్చరించడంతో పోలీసులు వారిని అరెస్ట్​ చేసి స్టేషన్ కు తరలించారు. నిర్వాసిత రైతులు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్​ పాల్గొన్నారు.