- బల్దియా పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు..
ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సీఎం రేవంత్ అన్న బస్తీబాట.. కంది శ్రీనన్న పాదయాత్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసులో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా బస్తీబాట కార్యక్రమ పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రతి బస్తీకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యమన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ టికెట్ దక్కుతుందని, టికెట్ సాధించిన అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, భోథ్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, దిగంబర్ రావు, జహీర్ రంజాని, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రియాంక గాంధీ బర్త్డే వేడుకలు
ఏఐసీసీ అగ్రనేత అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ పుట్టిన రోజు వేడుకలను కంది ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
