
- కేటీఆర్ పై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఏజెంట్లు నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
ఈ విషయాన్ని నిరుద్యోగులు మరచిపోవద్దని కోరారు. మిగిలిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని దయాకర్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఏజెంట్ల మాటలు నమ్మవద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని నిరుద్యోగులను కోరారు.