బీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

బీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్​ లీడర్​ కుంభం అనిల్​కుమార్​ రెడ్డి చెప్పారు. శుక్రవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రెస్‌ మీట్‌ పెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ లీడర్‌‌ రామాంజనేయులు ముందు పోటీ చేయనని చెప్పి..  తర్వాత మాట మార్చారన్నారు. పార్టీ ఢిల్లీ పెద్దలు మొదట్లో తనను పట్టించుకోలేదని అందుకే బీఆర్​ఎస్​లో చేరానని చెప్పారు.  తర్వాత ఎంపీ కోమటిరెడ్డి సహా ఢిల్లీ పెద్దలే కాంగ్రెస్​లోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.

ఇప్పుడు పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, తాను ఎంపీ కోమటిరెడ్డి నాయకత్వంలోనే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. భువనగిరి అసెంబ్లీ టికెట్, బీసీలతో పాటు​ఎవరికి ఇచ్చినా తాను వారి గెలుపునకు సహకరిస్తానన్నారు.  బీఆర్​ఎస్​ సర్కారుకు తొమ్మిదేండ్లుగా గుర్తుకు స్కీమ్స్​ ఎన్నికలు సమీపిస్తుండడంతో గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దళిత, బీసీ, మైనార్టీ బంధుతో పాటు గృహలక్ష్మి పథకాన్ని బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని  ఆరోపించారు. గృహలక్ష్మి స్కీంపై ఈ నెల 9న నిరసన దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు.