కుట్రలతో ఇబ్బంది పెట్టిన్రు: ఎమ్మెల్యే సీతక్క

కుట్రలతో ఇబ్బంది పెట్టిన్రు: ఎమ్మెల్యే సీతక్క
  • బీఆర్ఎస్​లీడర్లకు ఆడబిడ్డ ఉసురు తగుల్తుంది
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు: బీఆర్‌ఎస్‌ లీడర్లు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో తనను చాలా ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్‌ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘బీఆర్ఎస్​నేతలు నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగుల్తది. రాష్ట్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే’ అని సీతక్క తెలిపారు.