చెన్నూరులో బాల్క సుమన్కు ఎదురీత.. ప్రచార వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

చెన్నూరులో బాల్క సుమన్కు ఎదురీత..  ప్రచార వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు ఎదురుగాలి వీస్తోంది. ఆయనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా మంగళవారం (నవంబర్ 21) చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లి గ్రామంలో బాల్క సుమన్ తరపున నడుస్తున్న ప్రచార రథాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ బాల్క సుమన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రికత్త నెలకొంది. చెన్నూరు నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా.. ఎన్నికల ప్రచారానికి ఎందుకు వస్తున్నారని నిలదీశారు.