కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు జమ చేస్తుందన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. గ్రామానికి చెందిన కోళ్ల పార్వతమ్మకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. జీపీ సెక్రటరీ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు శివరాజేశ్వరరావు, కోళ్ల సత్యం, గోపాల్ రావు, అర్జున్, నగేశ్, శ్రీశైలం, సత్యం
పాల్గొన్నారు.
