భద్రాద్రికొత్తగూడెం/ మరిపెడ, వెలుగు : ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సర్పై అలర్ట్గా ఉండాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలదేనని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్జాటోత్రామచంద్రునాయక్ అన్నారు.
బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై బూత్ లెవల్ కమిటీ మెంబర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. కొత్తగూడెంలో ఎంపీ, మరిపెడలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు చేస్తున్న కుట్రలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్తలే కీలకమన్నారు.
