ఓటుకు రూ.5 వేలు ఇస్తరట.. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కుట్ర : సీతక్క

ఓటుకు రూ.5 వేలు ఇస్తరట.. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కుట్ర : సీతక్క

తనను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ  రూ. 2 వందల కోట్లు ఖర్చు చేస్తుందని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఓటుకు రూ. 5 వేలు ఇస్తారని.. దొంగనోట్లు పంచుతున్నారు... చూసి తీసుకోండంటూ సీతక్క అన్నారు.  ములుగు మండలంలో  ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్న సీతక్క..  మద్యం పంపిణీతో మగవాళ్ళను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు.  ములుగు, పస్రా, ఎటురునాగారం కేంద్రాలుగా  కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్నారపని  చెప్పారు.  ములుగులో తనపై పోటీకి నిలబడింది నాగజ్యోతి కాదు.. కేసీఆర్, - కేటీఆర్ అని చెప్పారు.  

మనకు ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లోకి రానివద్దని తరమి కొట్టాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసి పేదలకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.