మూడు నెలల పాపను జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ దే

మూడు నెలల పాపను జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ దే

ఖమ్మం: పోడు భూములను లాక్కోవద్దన్నందుకు చిన్నపిల్లల తల్లులని కూడా చూడకుండా జైళ్లో పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బ్రిటీష్ కాలంలో కూడా ఇలా చేశారో లేదో కానీ, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కనికరం లేకుండా మూడు నెలల పాపను కూడా జైల్లో పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల పాపను జైల్లో పెట్టడం అత్యంత దురద్రుష్ట సంఘటన అని ఆమె ఆవేదన చెందారు. తల్లిని, పిల్లని జైల్లో పెట్టి హింసించడం దారుణమని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్లు, రోడ్ల మీద అడ్వకేట్లను హత్యచేసినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. బాధిత కుటుంబాలను భట్టి విక్రమార్కతో కలిసి పరామర్శించిన ఆమె.. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

‘బ్రిటిష్ కాలంలో కూడా 3 నెలల పాపను  జైల్లో పెట్టినరో లేదో కానీ… కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఇంచు కనికరం లేకుండా జైలులో పెట్టారు. 18 మంది ఆడవాళ్లు మరియు చిన్నపిల్లలు అని చూడకుండా కొట్టి చిత్రహింసలు పెట్టి బాత్రూంలు కడిగించారు. వైరా నియోజకవర్గం ఎల్లన్న నగర్ గ్రామంలో పోడు భూముల సమస్య పై అధికారుల తీరును ఖండిస్తున్నాను. భట్టి  విక్రమార్క గారు మరియు నేను కలిసి దాడి జరిగిన కుటుంబాలను పరామర్శించి వారికి తగిన న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడుతామని హామీ ఇవ్వడం జరిగింది’ అని సీతక్క పోస్ట్ చేశారు.