కర్ణాటక అసెంబ్లీలో వీర సావర్కర్ చిత్రపటం..  ప్రతిపక్షాలు ఫైర్

కర్ణాటక అసెంబ్లీలో వీర సావర్కర్ చిత్రపటం..  ప్రతిపక్షాలు ఫైర్

కర్ణాటక అసెంబ్లీలో వీర సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీ బయట ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. వివాదాస్పద వ్యక్తి ఫోటోను అసెంబ్లీలో ప్రదర్శించాల్సిన అవసమేంటని కాంగ్రెస్ నేత సిద్ధా రామయ్య ఫైర్ అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ హాలులో ఆరుగురు ప్రముఖుల చిత్రపటాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సావర్కర్ ఫోటో ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 

అయితే ఇది నిరసన కాదని అన్ని జాతీయ నాయకుల, సంఘ సంస్కర్తల చిత్రాలను కర్ణాటక అసెంబ్లీ హాలులో పెట్టాలని తమ డిమాండ్ అని సిద్ధరామయ్య తెలిపారు. వీర్ సావర్కర్ చిత్రపటాన్ని అసెంబ్లీలో పెట్టాలని స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సిద్ధరామయ్య అన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సిద్దాంతల పరంగా విభేదాలున్నా సావర్కర్ స్వాతంత్య్ర సమరయోధుడన్నారు. మరెవరి ఫొటో పెట్టాలి దావూద్ ఇబ్రహీందా అని  ఆయన ప్రశ్నించారు.