
- దాసు సురేశ్
ఎల్బీనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. శనివారం తుక్కుగూడలో బీసీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారన్నారు.
బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు. బీసీలు బలంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో త్వరలో పూర్తిస్థాయి నియోజకవర్గ, పట్టణ, డివిజన్, మండల కమిటీలను పూర్తి చేస్తామన్నారు. అనంతరం మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.