పెద్దపల్లి లో డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం

పెద్దపల్లి లో డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం

పెద్దపల్లి,/సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు శనివారం సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాలలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి,  ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. 

ఈ సందర్భంగా పెద్దపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులకు టీ పార్టీ ఇచ్చారు. తమను అధికారులు నిబంధనల పేరిట వేధిస్తున్నారని జిల్లాలోని పిఎంపి, ఆర్ఎంపిలు మంత్రులను కోరారు. దీంతో ఈ విషయమై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో చర్చించారు. సమస్య పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.