బోథ్​ కాంగ్రెస్ ​అభ్యర్థిని మారిస్తే ఊరుకోం : ఏరడ్ల చంద్రశేఖర్

బోథ్​ కాంగ్రెస్ ​అభ్యర్థిని మారిస్తే ఊరుకోం : ఏరడ్ల చంద్రశేఖర్

నేరడిగొండ, వెలుగు :  బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వన్నెల అశోక్​ను మారిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  ఏరడ్ల చంద్రశేఖర్ హెచ్చరించారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అధిష్టానం ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మారిస్తే ఊరుకోబోమన్నారు.

అభ్యర్థిని మారిస్తే గోండు ఆదివాసులను అవమానించినట్లేనన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అభ్యర్థి తరఫున జోరుగా ప్రచారం చేశామని, గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. అధిష్టానం పునరాలోచించి ప్రజల మద్దతు పొందుతున్న వన్నెల అశోక్ కు బీఫాం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.