
ఆర్మూర్, వెలుగు: ఆలూర్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్‌ను శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఆరు గ్యారంటీలపై విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జులు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, నేతలు ముక్కెర విజయ్, కళ్లెం మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.