
‘పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రియాంక గాంధీ చాలా కష్టపడ్డారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమెపై ప్రజలు చూపించిన అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో మేం విఫలమయ్యాం. ఇది అభ్యర్థులు, స్థానిక నేతలు, కార్యకర్తల వైఫల్యమే తప్ప ప్రియాంకది కాదు’ అని యూపీ కాంగ్రెస్చీఫ్రాజ్బబ్బర్ సోమవారం మీడియాతోచెప్పారు. రాష్ట్రంలో 80 చోట్ల పోటీచేస్తే ఒకే ఒక్క సీటు గెల్చుకోవడం అసంతృప్తి కలిగించిందన్నారు. అమేథీలో రాహుల్‌గాంధీ ఓటమి బాధాకరమని చెప్పారు. నియోజకవర్గానికి రాహుల్చాలా చేశారన్నారు. అమేథీ ప్రజలను తన కుటుంబంగా రాహుల్భావించారని, ప్రజలు మాత్రం ఆయనను ఓడించారన్నారు. వయనాడ్‌లో ఎంపీగా గెలిచి ఉండొచ్చు కానీ అమేథీలో ఓడిన బాధ రాహుల్‌ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. ఫతేపూర్‌సిక్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన రాజ్‌బబ్బర్ కూడా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమికి ఇతరులను నిందించబోమని బబ్బర్చెప్పారు.