- ఉపాధి హమీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగిండంపై కాంగ్రెస్ ఫైర్
కోల్‌బెల్ట్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుమాలిన చర్య అని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆదివారం రామకృష్ణాపూర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం పేరు చెబితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయన్నారు.
కాంగ్రెస్2004లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో స్వగ్రామాల్లోనే పనిదొరకడం వల్ల వలసలు తగ్గాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరిందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ స్కీమ్ నిధులకు కోత పెట్టిందన్నారు. ఇప్పుడు పేరు మార్చి కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందునల్ల బ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, లీడర్లు ఒడ్నల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, కనకరాజు, శ్యామ్ గౌడ్, కల్యాణ్ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతోందని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌సుజాత ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్‌లోని గాంధీ చౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, శ్రీలత, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
కాగ జ్ నగర్, వెలుగు: ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై ఆసిఫాబాద్జిల్లాకాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం కాగజ్‌నగర్‌తో పాటు పలు మండలాల్లో గాంధీ విగ్రహాల ముందు నిరసన దీక్ష చేశారు. ఉపాధి హామీ పథకానికి పెట్టిన కొత్త పేరును వెనక్కి తీసుకొని గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.
