ఆమనగల్లు, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
గురువారం కడ్తాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, గ్రామాలు మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలన్నారు.
ప్రతీ కార్యకర్త సమిష్టిగా కృషి చేసి భారీ మెజార్టీతో పంచాయతీలను కైవసం చేసుకోవాలని కోరారు. ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్, హనుమ నాయక్, జహంగీర్ బాబా, వెంకటేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.
