
- మరొకరిని తీసుకొస్తాడా.. అటేనా?
- తిరిగొస్తాడంటున్న కర్నాటక కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటకంలో మరో కొత్త అంకం తెరపైకి వచ్చింది. రెబెల్ఎమ్మెల్యేలలో ఒకరైన ఎంటీబీ నాగరాజ్ఆదివారం మళ్లీ ముంబై ఫ్లైటెక్కారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చల తర్వాత నాగరాజ్ తన రాజీనామాను ఉపసంహరించుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, నాగరాజ్మళ్లీ ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌నేతలు మాత్రం నాగరాజ్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరో రెబెల్ఎమ్మెల్యే కె.సుధాకర్‌కు నచ్చజెప్పి, వెనక్కు తీసుకురావడానికే నాగరాజ్ముంబై వెళ్లాడని చెబుతున్నారు.
సుధాకర్‌తో చర్చించాకే..
సుధాకర్‌తో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఒక్కడినే రాజీనామాను వెనక్కు తీసుకోలేనని నాగరాజ్మీడియాకు వెల్లడించారు. సుధాకర్ ను వెనక్కు తీసుకురావడానికే ముంబై వెళుతున్నట్లు ఆయన చెప్పారు. రెండు రోజులుగా సుధాకర్సెల్ఫోన్స్విచ్చాఫ్ వస్తోందని అందుకే తాను బయలుదేరానని వివరించారు. రాజీనామా వాపస్ తీసుకోవడానికి సుధాకర్ ఒప్పుకోకుంటే ఏంచేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడేమీ చెప్పలేనని అన్నారు. ఏదేమైనా రాజీనామాపై సుధాకర్‌తో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని నాగరాజ్స్పష్టం చేశారు.
మరో ఎమ్మెల్యేను తీసుకొస్తాడు..
చిక్‌బళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్ ముంబైలో ఉన్నారని, ఆయనను కలిసి కాంగ్రెస్‌లో కొనసాగేలా ఒప్పించేందుకే నాగరాజు ముంబై వెళ్లాడని కాంగ్రెస్ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ కె పాటిల్చెప్పారు. శనివారం జరిగిన చర్చలతో నాగరాజ్ రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకున్నాడని చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రామిస్ చేయడంతో పాటు సుధాకర్‌ను వెనక్కు తీసుకొస్తానని చెప్పాడన్నారు. మరో అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డిని సముదాయించే పనిని పాటిల్‌తో పాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ప్రెసిడెంట్ ఈశ్వర్ఖాండ్రెలకు కాంగ్రెస్బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా పాటిల్ ఆదివారం రామలింగా రెడ్డి నివాసం చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. అయితే, దీనిపై మాట్లాడేందుకు పాటిల్నిరాకరించారు.
ఆరోపణలు ఖండించిన నడ్డా
రాంచీ: కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందన్న కాంగ్రెస్ఆరోపణలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. కర్నాటక రాజకీయ సంక్షోభం కాంగ్రెస్‌పార్టీ అంతర్గత విషయమన్నారు. రాహుల్ రాజీనామాతో పార్టీ నేతలు కూడా రిజైన్ చేస్తున్నారని నడ్డా చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ లో కొత్త సంస్కృతి ఏర్పడిందన్నారు. ఓటు బ్యాంకు, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.