కాంగ్రెస్​ చీఫ్​ పోస్టుకు త్రిముఖ పోటీ?

కాంగ్రెస్​ చీఫ్​ పోస్టుకు త్రిముఖ పోటీ?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్​ మాజీ సీఎం దిగ్విజయ్​ సింగ్​ కూడా కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ బరిలో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ చేయడం ఖాయమైతే ఆఖరు రోజు గురువారమే కావడంతో ఇయ్యాల్నే దిగ్విజయ్​ నామినేషన్​ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సోనియాతో మాట్లాడేందుకు ఆయన బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్​ చీఫ్​ పోస్టుకు పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు, ఆ విషయంపై ఎవరితో చర్చించలేదన్నారు. ఇప్పటికే రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్​ల నామినేషన్​ దాదాపుగా ఖాయం కాగా దిగ్విజయ్​ రాకతో కాంగ్రెస్​ ప్రెసిడెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని పార్టీ నేతలు అంటున్నారు. సీఎం పోస్టుకు  గెహ్లాట్ రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని రాజస్థాన్​ మంత్రి ప్రతాప్​ సింగ్​ కఛరియావాస్ కొట్టి పారేశారు.