బీజేపీ పుట్టక ముందు నుంచే రాముడు ఉన్నాడు

V6 Velugu Posted on Aug 06, 2021

న్యూఢిల్లీ: ‘‘శ్రీరాముడు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కో.. లేదా మరే ఒక్క పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన బీజేపీ  పుట్టక ముందు నుంచే ఉన్నాడు. పురాతన కాలం నుంచి రాముడిని మనం అంతా పూజిస్తున్నాం” అని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు. ఒక జాతీయ మీడియా చానెల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాముడిని వ్యతిరేకించలేదని, ఆయన ఏ ఒక్క పార్టీకి సొత్తు కాదని ప్రమోద్ చెప్పారు. రామ మందిర నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ ఏన్నడూ వ్యతిరేకించలేదని, అయోధ్య రామ జన్మభూమిలో భవ్యమైన మందిరాన్ని నిర్మించడం అందరికీ సంతోషకరమైన విషయమని అన్నారు.

రామ మందిర ఉద్యమానికి కాంగ్రెస్ వ్యతిరేకి

ప్రమోద్ మాట్లాడిన అదే కార్యక్రమంలో ఉన్న బీజేపీ నేత వినయ్ కటారియా ఆ వ్యాఖ్యలను ఖండించారు. రామ మందిర ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉందని, అయితే కాంగ్రెస్‌లోని కొద్ది మంది వ్యక్తులు మాత్రమే అయోధ్య రామ మందిరానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. రామ జన్మ భూమి ఆలయం కోసం తాము నాలుగు ప్రభుత్వాలను త్యాగం చేశామని, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పుడిప్పుడే మార్పును గమనిస్తున్నామని వినయ్ కటారియా అన్నారు.

Tagged Bjp, Ayodhya, Congress, ram mandir, Pramod Krishnam

Latest Videos

Subscribe Now

More News