తెలంగాణలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది: ఎమ్మెల్యే వివేక్

తెలంగాణలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది: ఎమ్మెల్యే వివేక్

తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని వివేక్ సందర్శించారు. ఆయనతోపాటు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామికి మొక్కుకున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని.. ప్రజా పాలన వచ్చిందని చెప్పారు. అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కు బుద్ది రాలేదని.. లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెపుతారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. త్వరలో పూర్తిగా కనుమరుగవుతుందని వివేక్ జోష్యం చెప్పారు.