ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విద్యుత్‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు, మండలంలోని పలువురికి మంజూరైన పెన్షన్‌‌‌‌ కార్డులను శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. డబుల్‌‌‌‌ ఇంజన్‌‌ పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి తెలంగాణలో 
అమలవుతున్న సంక్షేమ పథకాలే ట్రబుల్‌‌‌‌ ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌‌‌‌లో వృద్ధులకు కేవలం రూ. 750 మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణలో 46 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ హేమంత్‌‌‌‌ కేశవ్‌‌‌‌ పాటిల్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ పి. అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, జడ్పీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ గోపగాని వెంకట నారాయణ గౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్‌‌‌‌, పీడీ కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ బి.సత్యనారాయణరెడ్డి, మెప్మా పీడీ రమేశ్‌‌‌‌ తదితరులు 
పాల్గొన్నారు.


పింఛన్లు, ఇండ్లు ఇప్పించండి
యాదాద్రి, వెలుగు : పింఛన్లు, ఇండ్లు ఇప్పించాలని పలువురు ప్రభుత్వ విప్‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను కోరారు. యాదాద్రి జిల్లా ఆలేరులో శనివారం ఆమె ప్రజాదర్భార్‌‌‌‌ నిర్వహించగా 48 అర్జీలు వచ్చాయి. దళితబంధు, డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు ఇప్పించాలని కొందరు, తమ పిల్లలకు గురుకుల స్కూళ్లలో సీట్లు ఇప్పించాలని మరికొందరు కోరారు. అనంతరం ఎస్‌‌‌‌డీఎఫ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌పై భువనగిరిలో నిర్వహించి రివ్యూలో ఆమె పాల్గొన్నారు. స్పెషల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ ద్వారా మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 
సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి
యాదగిరిగుట్ట, వెలుగు : వెటర్నరీ క్యాంప్‌‌‌‌లు, అవగాహన సదస్సులను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో శనివారం ఏర్పాటు చేసిన వెటర్నరీ క్యాంప్‌‌‌‌ను ఆమె ప్రారంభించిన అనంతరం పాడి రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకొని పాడిరైతులు లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌‌‌‌గౌడ్‌‌‌‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, సర్పంచ్‌‌‌‌ వంటేరు సువర్ణ ఇంద్రారెడ్డి, డీవీహెచ్‌‌‌‌వో కృష్ణ, ఈవో  మల్లికార్జున్ పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కొత్తగా కట్టిన డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే సునీత పరిశీలించారు. 

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
చండూరు (మర్రిగూడ), వెలుగు : డిండి ఎత్తిపోతల పథకం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్‌‌‌‌ వినయ్‌‌‌‌ కృష్ణారెడ్డి చెప్పారు. చర్లగూడెం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న మర్రిగూడ మండలం చర్లగూడెం, వెంకేపల్లి, వెంకపల్లి తండా, నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులతో శనివారం కలెక్టర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీని రూ. 20 లక్షలకు పెంచి, రంగారెడ్డి జిల్లాలో ఇండ్లు కట్టించి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌‌‌‌ చేశారు. అనంతరం కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నిర్వాసితులకు పరిహారం అందజేశామన్నారు. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ, రంగారెడ్డి జిల్లాలో ఇండ్ల నిర్మాణం విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వెంట అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ఎ.భాస్కర్‌‌‌‌రావు పాల్గొన్నారు.

పేదల బాగు కోసమే సంక్షేమ పథకాలు
మిర్యాలగూడ, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌, ప్రభుత్వ పథకాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే నాయకులు ఆ పథకాలకు దూరంగా ఉండాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌రావు సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆసరా లబ్ధిదారులకు శనివారం కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న అన్ని పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంఎంసీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, చిట్టిబాబు నాయక్, వైస్‌‌‌‌ ఎంపీపీ అమరావతి సైదులు, సర్పంచ్‌‌‌‌ భిక్షంగౌడ్, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌‌‌‌ పాల్గొన్నారు.

మునుగోడు ప్రజలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వైపే ఉన్నరు
చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : మునుగోడు ప్రజలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వైపే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌రావు చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌లో శనివారం జరిగిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెబుతూ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌కు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి నిధులు 
తీసుకురాలేని రాజగోపాల్‌‌‌‌రెడ్డి మళ్లీ పోటీ చేసి ఏం చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెన్‌‌‌‌రెడ్డి రాజు, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ బొడ్డు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, సింగిల్‌‌‌‌ విండో చైర్మన్‌‌‌‌ చింతల దామోదర్‌‌‌‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌‌‌‌యాదవ్‌‌‌‌, కౌన్సిలర్లు కొరగొని లింగస్వామి, సుల్తాన్‌‌‌‌ రాజు, తాడూరి శిరీష పరమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.


ఉద్యమ పార్టీ అని అధికారమిస్తే ఆగం చేసిన్రు
యాదగిరిగుట్ట, వెలుగు : ఉద్యమపార్టీ అని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేశారని కాంగ్రెస్‌‌‌‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం లక్ష్మీతండా, కంచల్‌‌‌‌తండా, మైలారం గ్రామాలకు చెందిన పలువురు లీడర్లు శనివారం యాదగిరిగుట్టలో బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ బీజేపీతో కుమ్మక్కై మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌లో చేరిన వారిలో మోహన్, రమేశ్‌‌‌‌, లక్ష్మణ్, రాజేంద్ర, సచిన్, కృష్ణ, నవీన్, సిద్ధు, సాయిగణేష్, అనిల్, అరుణ్ పాల్గొన్నారు.

నేడు యాదాద్రి జిల్లాకు కేంద్రమంత్రి
యాదాద్రి, వెలుగు : పార్లమెంట్‌‌‌‌ ప్రవాస్‌‌‌‌ యోజనలో భాగంగా భువనగిరి ఇన్‌‌‌‌చార్జి అయిన కేంద్ర మంత్రి దేవ్‌‌‌‌సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ ఆదివారం జిల్లాకు రానున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా చేనేత కార్మికులు, రైతులతో సమావేశమవుతారు. ఆదివారం భువనగిరిలో జరిగే కోర్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్న అనంతరం సోషల్‌‌‌‌ మీడియా, ఐటీ కన్వీనర్లతో సమావేశమవుతారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటారు. తర్వాత రఘునాథపురంలో చేనేత కార్మికులతో, వలిగొండలో రైతులతో సమావేశమవుతారు. మంగళవారం తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, యాచారంలో పర్యటించనున్నారు.

అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం
కోదాడ, వెలుగు : అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం ఆసరా పెన్షన్‌‌‌‌ కార్డులను అందజేసి మాట్లాడారు. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బుర్ర సుధారాణి, కమిషనర్‌‌‌‌ 
మహేశ్వర్‌‌‌‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, కోదాడ సొసైటీ చైర్మన్‌‌‌‌ రామారావు పాల్గొన్నారు.

పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్‌‌‌‌
దేవరకొండ, వెలుగు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచిందని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌ చెప్పారు. దేవరకొండ మున్సిపాలిటీకి చెందిన పలువురికి శనివారం ఆసరా పెన్షన్‌‌‌‌ పత్రాలను అందజేసి మాట్లాడారు. పెన్షన్‌‌‌‌ కోసం వయోపరిమితి తగ్గించడం వల్ల అనేక మందికి మేలు కలుగుతుందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌‌‌‌ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, కమిషనర్‌‌‌‌ వెంకటయ్య, వీరమోని అంజిగౌడ్, వడ్త్య దేవేందర్‌‌‌‌, పొన్నబోయిన సైదులు, వేముల రాజు పాల్గొన్నారు.