కోవిడ్​ కట్టడికి సీఎం స్టాలిన్​ కఠిన చర్యలు

కోవిడ్​ కట్టడికి సీఎం స్టాలిన్​ కఠిన చర్యలు

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్​ ముందస్తు చర్యలు చేపట్టారు. కోవిడ్​ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కోవిడ్​ రివ్యూలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. కోవిడ్​ కట్టడికి వివిధ శాఖలకు చెందిన వారు తమవంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే కోవిడ్​ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త

మిళనాడులో శుక్రవారం 219 కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కుటుంబంలోని ఓ వ్యక్తిని కోవిడ్​ లక్షణాలు కనిపిస్తే...సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్​ కట్టడికి ముఖానికి మాస్కులు ధరించాలని..సామాజిక దూరం పాటిస్తూ..కోవిడ్​ రూల్స్​ పాటించాలని తెలిపారు. కరోనా వైరస్​పై పోరాడేందుకు వ్యాక్సిన్​ ఒక్కటే సరైన ఆయుధమన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 93.82 శాతం మందికి మొదటి డోస్​ వేయగా..82.94 శాతం మందికి సెకండ్​ డోస్​ వేశామని సీఎం స్టాలిన్​ చెప్పారు.