హైదరాబాద్, వెలుగు: కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ సోమవారం (నవంబర్ 03) ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) తో వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా 2 గిగావాట్లు, అంతకంటే ఎక్కువ గ్రిడ్-కనెక్టెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఉమ్మడిగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్కు విద్యుత్ సరఫరా కోసం ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. నెట్-జీరో ఆపరేషన్స్‌కు తమ నిబద్ధతను కొనసాగించడానికి ఈ భాగస్వామ్యం ముఖ్యమని సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్జీఈఎల్కు ప్రస్తుతం 8.9 గిగావాట్ల సామర్థ్యం ఉంది. 2032 నాటికి 60 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
