సంజయ్‌‌ అరెస్టుపై  ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిసరన

సంజయ్‌‌ అరెస్టుపై  ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిసరన
  • బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ
  • పలు చోట్ల దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: బీజేపీ లీడర్లను నిర్బంధించి పార్టీకి వస్తున్న ప్రజాదరణను అడ్డుకోలేరని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ అన్నారు. ఎంపీ బండి సంజయ్ అరెస్ట్‌‌ను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌‌ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇందూరు పార్టీ ఆఫీస్‌‌లో జరిగిన నిరసనలో ధన్‌‌పాల్‌‌ పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ లీడర్లపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, అక్కడి ఎంపీలు ఆధారాలతో సహా బయట పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా వైస్​ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, యువ మోర్చా అధ్యక్షుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కైసర్, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుక్క మధు, మెట్టు విజయ్, ప్రమోద్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో  రెండు గంటల పాటు దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్​సెక్రటరీ తేలు శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, లీడర్లు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల కండువాలతో మౌన దీక్ష చేపట్టారు. బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, నాయకులు సుధాకర్ చారి, రామరాజు, ధర్మన్న, రవి, విజయ్, గంగాధర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నవీపేట్‌‌లో బోధన్ నియోజకవర్గ లీడర్ మోహన్‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అలాగే మద్నూర్‌‌‌‌, ఆర్మూర్, ఏర్గట్ల, భిక్కనూరు తదితర మండల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 

సంజయ్ దీక్షకు మద్దతు

నిజామాబాద్ టౌన్, వెలుగు: అక్రమ అరెస్టులు, దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న నిరసన దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్ సూర్యనారాయణ బుధవారం పాల్గొన్నారు. నిజామాబాద్‌‌ దీక్ష అనంతరం ధన్‌‌పాల్‌‌ స్థానిక లీడర్లతో కరీంనగర్‌‌‌‌ తరలి వెళ్లి మద్దతు తెలిపారు.