కుకింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌: నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది

కుకింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌: నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది

ఆరు పదుల వయసులోనూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్ యూట్యూబ్ సెన్సేషన్‌‌‌‌ నిషా మధులిక. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌తో పోటీ పడి యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ను రన్‌‌‌‌ చేస్తోంది. అంతేకాదు.. సోషల్‌‌‌‌ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది. తన ఛానెల్‌‌‌‌లో కుకింగ్ వీడియోలను అప్‌‌‌‌లోడ్ చేస్తూ.. ‘‘కుకింగ్ క్వీన్‌‌‌‌’’గా పేరు తెచ్చుకుంది. నిషా మధులిక డిగ్రీ లేని మాస్టర్‌‌‌‌‌‌‌‌ చెఫ్. రెస్టారెంట్ కన్సల్టెంట్ కూడా. అమర్ ఉజాలా, ఇండియన్ ఎక్స్‌‌‌‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్‌‌‌‌లతోపాటు అనేక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లలో ఫుడ్ కాలమ్స్‌‌‌‌ని రాస్తోంది. పక్కా ఇండియన్‌‌‌‌ ఫుడ్‌‌‌‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా ఇండియన్స్‌‌‌‌ కిచెన్‌‌‌‌లో ఉండే ఇంగ్రెడియెంట్స్‌‌‌‌తో చేయగలిగే వంటలే చేస్తుంటుంది. తక్కువ టైంలో చేసుకోగల వంటకాలను అందరికీ పరిచయం చేయాలనే లక్ష్యంతోనే ‘‘నిషా మధులిక” అనే యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టింది నిషా. వీడియోల్లో ఇంగ్రెడియెంట్స్‌‌‌‌, వంట విధానం గురించి అందరికీ అర్థమయ్యేట్టు వివరంగా చెప్పడం వల్ల తక్కువ టైంలోనే జనాలకు దగ్గరైంది. నిషా ఇప్పటివరకు 1,800 పైగా వీడియోలను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి మరో కారణం చేసే ఫుడ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పరిమెంట్స్‌‌‌‌. తనకు అందుబాటులో ఉన్న ఇంగ్రెడియెంట్స్‌‌‌‌తో ఎక్స్‌‌‌‌పరిమెంట్స్‌‌‌‌ చేసి  చూపిస్తుంటుంది. ఇప్పుడు ఆమె ఛానెల్‌‌‌‌కు 12.4 మిలియన్ల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు. 
 

వంట చేయడం ఇష్టం
నిషా ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని నోయిడాలో 1959లో పుట్టింది. సొంతూరిలోనే స్కూల్‌‌‌‌ చదువు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువు పూర్తయ్యాక ఎంఎస్ గుప్తాను పెళ్లి చేసుకుంది. ఆయన ఢిల్లీలో టెక్ బిజినెస్‌‌‌‌మెన్‌‌‌‌. దాంతో ఆమె కూడా తన భర్తతో కలిసి ఢిల్లీకి షిఫ్టయ్యి, వాళ్ల ఆఫీసులోనే అకౌంటెంట్‌‌‌‌గా పనిచేయడం మొదలుపెట్టింది.  కొంతకాలం తర్వాత ఢిల్లీ నుంచి నోయిడాకు మారారు. దాంతో ప్రతి రోజూ నోయిడా నుంచి ఢిల్లీలోని ఆఫీస్‌‌‌‌కు వెళ్లడం కష్టమైపోయింది. అందుకే ఉద్యోగం మానేసింది. కానీ.. ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఒంటరితనంగా అనిపించింది. అప్పుడామెకు ‘‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్” కూడా వచ్చింది. ఆ సిండ్రోమ్‌‌‌‌ నుంచి బయటపడ్డాక ఖాళీగా ఉండకూడదని డిసైడ్ అయింది. అందుకే ఖాళీ టైంలో బ్లాగులు రాయాలి అనుకుంది. తన నిర్ణయాన్ని భర్తకి, కొడుక్కి చెప్పింది. వాళ్లు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే కుకింగ్‌‌‌‌ బ్లాగ్‌‌‌‌లు రాయడం మొదలుపెట్టింది. బ్లాగ్‌‌‌‌లో కంటెంట్‌‌‌‌తోపాటు ఫొటోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాలి. అందుకోసం మంచి ఫొటోలు కావాలి. అందుకే ఆమెకు కెమెరా కొనిచ్చాడు భర్త. ఆమె వంట చేస్తూ.. ఆ కెమెరాతో ఫొటోలు తీసేది. యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాక ఆ ఎక్స్‌‌‌‌పీరియెన్స్  బాగా పనికొచ్చింది. 
 

సొంత వెబ్‌‌‌‌సైట్‌‌‌‌
ఆమె రాసిన బ్లాగ్‌‌‌‌లను ముందు కొన్ని కుకింగ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లలో పోస్ట్‌‌‌‌ చేసింది. తక్కువ టైంలోనే వంటకాలకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో వంద బ్లాగులు పూర్తి కాగానే ఆమె కొడుకు బ్లాగ్స్‌‌‌‌ కోసం సొంతంగా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ మొదలుపెట్టాలని సలహా ఇచ్చాడు. అప్పుడామె “nishamadhulika.com” అనే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ మొదలుపెట్టింది. ఆ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ కూడా తక్కువ టైంలో చాలా ఫేమస్‌‌‌‌ అయింది. అంతేకాదు.. ఆ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఆమెను ఫాలో అయ్యేవాళ్లంతా ఆమెను యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాలని, ఫుడ్ వీడియోలు చేయాలని సలహాలు ఇచ్చారు. దాంతో 2009లో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది. అలా మొదలైన యూట్యూబ్‌‌‌‌ జర్నీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 

కొడుకు సాయంతో... 
ఛానెల్ పెట్టింది కానీ.. వీడియోలు ఎలా తీయాలో, ఎలా అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాలో ఆమెకు అంతగా తెలియదు. అందుకే వాటికోసం కొడుకు సాయం తీసుకుంది. కొన్ని రోజుల్లోనే వీడియో తీయడం దగ్గర్నించి... అన్ని టెక్నిక్స్‌‌‌‌ నేర్చుకుంది. ఇప్పుడు తనే షూట్​ చేసి, అప్‌‌‌‌లోడ్  చేస్తోంది. ఫేమస్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ చెఫ్ సంజీవ్ కపూర్ కూడా ఆమెకు వంట చేయడంపై ఉన్న ఇష్టాన్ని చూసి మెచ్చుకున్నాడు. అయితే.. ఆమెను అందరూ చెఫ్‌‌‌‌గా గుర్తిస్తున్నా.. తనకు వంట చేయడంలో ఎలాంటి డిగ్రీ లేదు. అమ్మ దగ్గర నేర్చుకున్న వంటతోనే ఇంతటి పాపులారిటీ తెచ్చుకుంది. 
 

అవార్డులు
ఎందరో ఆడవాళ్లకు స్ఫూర్తిగా నిలిచినందుకు 2013లో “యూట్యూబర్స్‌‌‌‌ హెల్పింగ్ ఉమెన్ గెట్ ఆన్‌‌‌‌లైన్” టైటిల్‌‌‌‌ను దక్కించుకుంది.  2014లో “యూట్యూబ్ టాప్ చెఫ్” లిస్ట్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ దక్కింది. 2017లో ‘‘ది సోషల్ మీడియా సమ్మిట్ అండ్‌‌‌‌ అవార్డ్స్” లో బెస్ట్‌‌‌‌ కుకింగ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌గా గుర్తింపు దక్కింది. ఎకనామిక్ టైమ్స్ ఆమెను 2016లో ‘‘ఇండియాస్‌‌‌‌ టాప్‌‌‌‌ టెన్‌‌‌‌ యూట్యూబ్ సూపర్ స్టార్స్’’లో చేర్చింది. ఇప్పటివరకు నిషా 18.9 కోట్ల వరకు సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్‌‌‌‌, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌ ద్వారా నెలకు 20 లక్షల వరకు సంపాదిస్తోంది.