
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి పోలీసులు క్షమాపణలు చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ బాధిత కుటుంబసభ్యుల్ని కలిసేందుకు ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ వెళ్లారు. ఆ సమయంలో నోయిడా – ఉత్తర్ ప్రదేశ్ బోర్డర్ లో యూపీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతల్ని నిలవరించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా యూపీ పోలీసులు ప్రియాంక గాంధీని నెట్టడం వివాదాస్పదమైంది. దీంతో పలుపార్టీలకు చెందిన నేతలతో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో మహిళా పోలీసులు లేరా అని ప్రశ్నించారు. మగ పోలీస్ అధికారి ప్రియాంక గాంధీ కుర్తాను లాగడం ఏంటని మండిపడ్డారు. ఈ వివాదంపై నోయిడా,యూపీ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పారు. దీంతో చివరకు దిగొచ్చిన యూపీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.